ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యోగివేమన విశ్వ విద్యాలయ ఉద్యోగులు, హాస్టల్ వర్కర్లు ఆందోళన - Yogivemana University in kadapa district news update

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. కడప జిల్లాలోని యోగివేమన విశ్వ విద్యాలయంలో ఉద్యోగులు, హాస్టల్ వర్కర్లు ఆందోళన బాట పట్టారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని తేల్చి చెప్పారు.

hostel staff protest
hostel staff protest

By

Published : Apr 22, 2021, 7:48 PM IST

యోగివేమన విశ్వ విద్యాలయంలో ఉద్యోగులు, హాస్టల్ వర్కర్లు చేస్తున్న ఆందోళన నాలుగో రోజుకు చేరింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని.. కొన్ని ఏళ్ళ నుంచి పని చేస్తున్నా వేతనాలు పెంచలేదని వాపోయారు. పే స్కేల్, రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని ఎప్పటినుంచి అడుగుతున్న పట్టించు కోవటం లేదని తెలిపారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని తేల్చి చెప్పారు.

ఈ విషయమై ప్రిన్సిపల్​ను వివరణ కోరగా.. పై అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్ళమని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి.. వారికి తగిన న్యాయం చేస్తామని పేర్కొన్నారు. కమిటీని ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి విషయం తెలియజేస్తామన్నారు.

ఇవీ చూడండి..:బావిలో అధ్యాపకుడి మృతదేహం..అసలేం జరిగింది..?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details