యోగి వేమన విశ్వవిద్యాలయానికి త్వరలో న్యాక్ బృందం రానుందని ఉపకులపతి సూర్య కళావతి తెలిపారు. రూ.126 కోట్లతో అభివృద్ధి పనులు జరగనున్నాయని చెప్పారు. ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె కడపలోని సీపీ బ్రౌన్ గ్రంధాలయంలో మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలోనూ యూజీ, పీజీ, బీఈడీ, లా ఇంజినీర్ పరీక్షలు నిర్వహించి.. ఫలితాలు ప్రకటించామని వివరించారు.
'రూ.126 కోట్లతో యోగివేమన విశ్వవిద్యాలయం అభివృద్ధి'
రూ.126 కోట్లతో యోగి వేమన విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పనులు జరగనున్నాయని ఉపకులపతి సూర్య కళావతి వివరించారు. కరోనా సమయంలోనూ యూజీ, పీజీ, బీఈడీ, లా ఇంజినీర్ పరీక్షలు నిర్వహించి.. ఫలితాలు ప్రకటించామని చెప్పారు. త్వరలో ఈ-లైబ్రరీ, ఈ-జర్నల్స్, డేటాబేస్ పుస్తకాలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పనులు
సీపీ బ్రౌన్ గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయంలో ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని, నిర్మాణం పూర్తి కాగానే సిబ్బంది నియామకం చేపడుతామని పేర్కొన్నారు. త్వరలో ఈ-లైబ్రరీ, ఈ-జర్నల్స్, డేటాబేస్ పుస్తకాలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఇదీ చదవండి: జిల్లాలో మొదటిరోజు కొనసాగిన నామినేషన్లు