లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొరుగు సేవల ఉద్యోగులకు కడప యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి సూర్య కళావతి నిత్యావసర వస్తువులను అందజేశారు. సుమారు 50 మందికి నిత్యావసర సరకులు అందజేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పొరుగు సేవల ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కళావతి తెలిపారు. ఈ మేరకు వారికి నిత్యావసర సరకులను అందజేశామని ఆమె పేర్కొన్నారు.
పొరుగుసేవల ఉద్యోగులకు నిత్యావసరాల పంపిణీ - latest news on yogi vemana vc
కడప యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి సూర్య కళావతి.. పొరుగు సేవల ఉద్యోగులకు నిత్యావసర సరకులు అందించారు. లాక్ డౌన్ నేపథ్యంలో పొరుగు సేవల ఉద్యోగులు జీతం లేక ఇబ్బంది పడుతున్నారని సూర్యకళావతి ఆవేదన వ్యక్తం చేశారు.
సరకులు పంపిణీ చేస్తున్న ఉప కులపతి సూర్య కళావతి