ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యోగా దినచర్యలో భాగం కావాలి: మంత్రి అంజాద్​బాషా - deputy speaketr

కడపలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్​ భాషా పాల్గొన్నారు. యోగాను దిన చర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.

యోగా చేస్తున్న మంత్రి అంజాద్​బాషా

By

Published : Jun 21, 2019, 1:32 PM IST

యోగా చేస్తున్న మంత్రి అంజాద్​బాషా

యోగా అనేది భారతదేశ ప్రాచీన సంప్రదాయమని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. యోగాను పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైన ఉందని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప ఉమేష్‌చంద్ర కల్యాణ మండపంలో భారీ ఎత్తున యోగాసనాలు వేశారు. జిల్లా అధికారులు, విద్యార్థులు, నగరవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి యోగాసనాలు వేశారు. యోగా చేయడం వల్ల ఆ రోజు ఎంతో ఉల్లసంగా, ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. యోగాతో సర్వరోగాలు నయమవుతాయన్నారు. యోగాను దినచర్యగా చేసుకోవాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details