YCP youth leader Sensational comments: వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి సంచలన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను పక్కనపెడితే.. 'రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాల్సింది చంద్రబాబే' అంటూ షేక్ మీరావలి ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంకా ఆ వీడియోలో పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు.
''ఈరోజు నేను ఈ ఇండిగో విమానంలో ప్రయాణం చేస్తున్నా. నాతోపాటు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాత నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. చాలామంది చెప్తారు ఆయన చార్టర్ ప్లైట్‌లో వెళ్తారు.. రాజధాని కోసం వెచ్చిచిన డబ్బులను ఖర్చు చేస్తారని.. అది తప్పు. నేను వైసీపీకి చెందిన వ్యక్తిని.. అది కాదు ముఖ్యం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది ముఖ్యమని బాబుగారు నాతో అన్నారు. సార్ మీరు చేస్తున్న ఈ సేవ చాలా ఆనందదాయకమైంది. రాజకీయాలు పక్కనబెడితే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాల్సింది చంద్రబాబే'' -వీడియోలో షేక్ మీరావలి