'ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు' - రైల్వే కోడూరులో వైకాపా ర్యాలీ వార్తలు
'ఒక రాజధాని వద్దు - మూడు రాజధానులు ముద్దు' అంటూ కడప జిల్లా రైల్వే కోడూరులో వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారని వైకాపా నేతలు తెలిపారు.
ycp rally at railwaykodur support for three capitals for AP
By
Published : Jan 12, 2020, 4:30 PM IST
మూడు రాజధానులకు అనుకూలంగా వైకాపా నేతల ర్యాలీ
కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ' మూడు రాజధానులు ముద్దు - ఒక రాజధాని వద్దు' అంటూ నినాదాలు చేశారు. ఒకే రాజధాని ఉంటే అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవుతుందని స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు.