సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. కడప జిల్లా ఎర్రగుంట్లలో వైకాపా శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో.. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు యాత్ర సాగింది. వైకాపా రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారు అంబటి క్రిష్ణారెడ్డితో సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వందల మందితో నిర్వహించిన ఈ యాత్రలో.. కరోనా నిబంధనలు గాలికొదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు.
ఎర్రగుంట్లలో వైకాపా శ్రేణుల విజయోత్సవ ర్యాలీ - విజయోత్సవ ర్యాలీలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో.. కడప జిల్లా ఎర్రగుంట్లలో వైకాపా శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి. పలువురు నేతలు పాల్గొని.. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు యాత్ర కొనసాగించారు.
ఎర్రగుంట్లలో వైకాపా విజయోత్సవ ర్యాలీ