MLA Rachamallu On Bhuvaneswari: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అనుమతిస్తే.. వైకాపా ఎమ్మెల్యేలందరమూ కలిసి కన్నీటితో ఆమె పాదాలు కడుగుతామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరిని తమ పార్టీ ఎమ్మెల్యేలు కించపరచలేదన్న ఆయన.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
భువనేశ్వరి అనుమతిస్తే.. కన్నీటితో పాదాలు కడుగుతాం: వైకాపా ఎమ్మెల్యే శాసనసభలో భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కంచపరిచేలా వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. గౌరవసభ పేరుతో చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరిని అవమానిస్తున్నారని విమర్శించారు.
"చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి శాసనసభలో వైకాపా ఎమ్మెల్యేలు అసభ్యవ్యాఖ్యలు చేశారనటం సరికాదు. చంద్రబాబు గౌరవ సభల పేరిట ఆమెకు తీరని అవమానం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా చెబుతున్నాం. ఆమెను ఎవరూ కించపరచలేదు. ఆమెను ఎవరో తెదేపా ఎమ్మెల్యే అన్నందుకు చితిస్తున్నాం. వల్లభనేని వంశీ మా పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా.. సహచర ఎమ్మెల్యేలుగా ఆయన వ్యాఖ్యలను తప్పపడుతున్నాం. ఆ తల్లి అనుమతిస్తే.. మా పార్టీ ఎమ్మెల్యేలందరం మా కన్నీటితో ఆమె పాదాలు కుడుగుతాం." - రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైకాపాఎమ్మెల్యే
ఇదీ చదవండి
నాకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదు: నారా భువనేశ్వరి