కడప జిల్లా రైల్వే కోడూరులో వైకాపా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తనపై దాడి చేశారని తెదేపా రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను వైకాపా ఎమ్మెల్యే కొట్టిపారేశారు. నరసింహ ప్రసాద్‌పై దాడి చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. తనది దాడి చేసే స్వభావం కాదని ఎమ్మెల్యే కొరముట్ల స్పష్టం చేశారు.
'నరసింహ ప్రసాద్‌పై దాడి చేయాల్సిన అవసరం నాకు లేదు' - తెదేపా రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ కామెంట్స్
వైకాపా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుపై తెదేపా రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దాడి చేశారని ఆరోపించారు. దీనిపై కొరముట్ల శ్రీనివాసులు స్పందించారు. దాడి చేసే స్వభావం తనది కాదని తెలిపారు.
అవసరం నాకు లేదు