చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన దేశాయ్ తిప్పారెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నవాజ్ బాషాకు టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలుసుకున్న తిప్పారెడ్డి జగన్‌ను కలవగా తాను చేయించిన సర్వేలో గెలుపు అవకాశాలు ఉన్న వారికే టికెట్లు ఇస్తున్నారని తెలిపారు. తీవ్ర అసహనానికి లోనైన తిప్పారెడ్డి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేశారు. ఉద్వేగానికి లోనయ్యారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తానని ప్రకటించారు.
ఫ్యాను కింద నేతలకు ముచ్చెమటలు - GOWRI CHARITHA
ఎన్నికల అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు జరుగుతుండగానే వైకాపాలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. పార్టీ అధిష్ఠానం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పలు చోట్ల పార్టీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు.
చిత్తూరు జిల్లాకే చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే సునిల్ కుమార్ తొలి నుంచీ పార్టీకి సేవలందిస్తోన్న ఆయన స్థానంలో గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన పద్మజా రెడ్డిని వైకాపాలో చేర్చుకున్నారు. పూతల పట్టు నుంచి ఆమెకే టికెట్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై మాట్లాడేందుకు హైదరాబాద్‌లోని జగన్ నివాసానికి చేరుకున్న కుటుంబంతో కలసి వచ్చిన సునీల్‌కు అవమానం జరిగింది. తనను కలిసేందుకు అనుమతించని జగన్....సెక్యూరిటీ సిబ్బందితో వెనక్కి పంపించారు. అదే జిల్లాకే చెందిన ఇతర నేతలను ఇంటిలోకి పంపినా...ఆయన్ను మాత్రం పంపకుండా గేటుముందే నిల్చొబెట్టారు. 2 గంటలకుపైగా వేచి చూసినాజగన్ ఇంట్లోకి అనుమతించకపోవడంతో చేసేది లేక తీవ్ర నిరాశతో ఎమ్మెల్యే సునిల్ వెనుతిరిగారు. సెల్పీ వీడియో తీసి పంపిన ఆయన..పార్టీకి తాను అందించిన సేవలను ...తనకు జరిగిన అవమానాన్ని అవమానాన్ని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు
పార్టీకి తొలినుంచీ సేవలందిస్తోన్న కడప జిల్లా రాజంపేట ఇన్ చార్జ్ , మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డికి ఈ సారి నిరాశే మిగిలింది. ఆ స్థానంలో తెదేపా నుంచి వచ్చిన మేడా మల్లికార్జున రెడ్డికి జగన్ సీటు కేటాయించారు. ఇది ఆకేపాటి వర్గంలో తీవ్ర అసంతృప్తి కి కారణమైంది. పార్టీ నేతలు బుజ్జగించడంతో ప్రస్తుతానికి ఆకేపాటి వర్గం సద్దుమణిగినా దీని ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుందనేది వైకాపా శ్రేణుల్లో ఆందోళన కల్గిస్తోంది. కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన గౌరు కుటుంబానికి ఈసారి అన్యాయం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలన్నీ వైకాపా శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముందే ఆందోళనలు ,అసంతృప్తులు పెరుగుతోన్న పరిణామాలుఇబ్బంది కలిగిస్తున్నాయి.పార్టీలో చేరికలు పెరిగే కొద్దీ... టికెట్లు తమకే ఖరారవుతాయని అనుకున్న నియోజక వర్గ సమన్వయకర్తలు తమ సీట్లు ఎక్కడ గల్లంతవుతాయోనని ఆందోళన చెందుతున్నారు.