వైకాపా నేతలు తన కుటుంబాన్ని చిత్ర హింసలకు గురి చేస్తున్నారని జ్యోతి అనే మహిళ ఆరోపించింది. తన భర్తపై అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేసింది. కడప ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి సంబంధించి ఎంపీటీసీ బీసీ మహిళకు కేటాయించగా నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. నామినేషన్ ఉపసంహరించుకోవాలని స్థానిక వైకాపా నాయకులు బెదిరించారు. వారి బెదిరింపులకు భయపడి ఊరి వదలి వెళ్లాం. కొద్దిరోజుల క్రితం తిరిగి గ్రామంలోకి రాగా... నా భర్తపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించి అరెస్టు చేయించారు. బీసీలు రాజకీయంగా ఎదగకూడదా?. అధికారులు న్యాయం చేయకపోతే నా కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం-జ్యోతి, బాధితురాలు