కడప జిల్లా కమలాపురంలో తెదేపా నేతలపై వైకాపా నాయకుడు కొడవళ్లతో హాల్ చల్ చేసి దాడి చేయడానికి యత్నించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్త నరసింహారెడ్డి అన్నారు. తమ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని...దాడికి పాల్పడిన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తెదేపా నేతలపై వైకాపా నేత దాడికి యత్నం - కడప జిల్లా వార్తలు
తెదేపా నేతలపై వైకాపా నేత దాడికి యత్నించిన ఘటన కడప జిల్లా కమలాపురంలో జరిగింది.
తెదేపా నేతలపై వైకాపా నేత దాడికి యత్నం