ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 7, 2023, 8:22 PM IST

ETV Bharat / state

వైయస్సార్ జిల్లాలో కలకలం.. వైసీపీ నేత హత్య

YCP leader killed: వైయస్సార్ జిల్లాలో వైసీపీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పొలంలో నీరు పెడుతున్న సమయంలో దాడి చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. తలపై తీవ్ర గాయం కావటంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు స్పష్టం చేశారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

YCP leader killed
YCP leader killed

వైయస్సార్ జిల్లాలో కలకలం.. వైసీపీ నేత హత్య

YCP leader killed: వైయస్సార్ జిల్లా కమలాపురంలో వైసీపీ నేత శంకర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు తన పొలం వద్ద వ్యవసాయ మోటార్ వద్ద నీరు పారకట్టే సమయంలో దాడి చేసి చంపారు. తలపై బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక సమాచారం తెలుసుకున్న.. స్థానిక ఎస్సై చిన్న పెద్దయ్య తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఐ సత్తిబాబు ఎస్సై చిన్న పెద్దయ్య కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. సీఐ సత్తిబాబు మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం రామసుబ్బారెడ్డి తమ్ముడి కుమార్తెను చనిపోయిన వైసీపీ నేత శంకర్ రెడ్డి కుమారుడు ప్రేమించి తీసుకెళ్లాడు. ఆ కేసు స్థానిక స్టేషన్​లో కూడా నమోదయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విషయం గురించే ఈ హత్య జరిగి ఉంటుందని అక్కడ వారు భావిస్తున్నారు. పూర్తి సమాచారం విచారణ అనంతరం తెలుస్తుందని తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ నేత శంకర్ రెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించి తానున్నానంటూ.. కుటుంబ సభ్యులను ఓదార్చారు హత్యకు కారకులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

ఇటువంటి ఘటన కమలాపురం టౌన్​లో జరగడం ఎన్నడూ లేదు ఎప్పుడో ఇలాంటివి జరిగి ఉంటాయేమో కాని ఇప్పుడు ఇలాంటివి చూడలేదు. ఇక్కడ జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఇందులో ఎంతటి వారున్నా సరే తప్పకుండా వారికి శిక్ష పడుతుంది. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని.. మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉంటాయని నేను భావిస్తున్నాను.- రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే కమలాపురం

శంకర్​ రెడ్డిని తన పొలం దగ్గర చేనుకు నీరు పెడుతుంటే.. కొందరు వ్యక్తులు వచ్చి చంపారు అని ప్రాధమిక సమాచారం రావడం జరిగింది. అప్పుడు వెంటనే ఎస్సే వారి సిబ్బంది రావడం జరిగింది. ఆ తర్వాత నేను రావడం జరిగింది. ప్రాధమిక విచారణలో తేలింది ఏంటంటే రెండు నెలల క్రితం శంకర్​ రెడ్డి పెద్ద కొడుకు.. రామసుబ్బారెడ్డి తమ్ముడి కూతురిని ప్రేమించి తీసుకువెళ్లడం జరిగింది. దానికి సంబందించి స్థానిక స్టేషన్లో కూడా నమోదయింది. అందులో భాగంగానే ప్రాధమికంగా తెలిసిన సమాచారం. ఇంకా పూర్తి సమాచారం విచారణలో తెలియాల్సి ఉంది.- సత్తిబాబు, సీఐ కమలాపురం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details