DL Ravindra reddy comments: ముఖ్యమంత్రి జగన్ రెండున్నరేళ్లపాలనపై.. వైకాపా నాయకుడు, మాజీ మంత్రి డీ.ఎల్.రవీంద్రారెడ్డి ఎప్పటిలానే విమర్శలు గుప్పించారు. రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి పథకానికి వైఎస్సార్ పేరు పెడుతున్న ముఖ్యమంత్రి.. ఆయన పేరుతో ఉన్న పథకాలను రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా వచ్చిన డబ్బులు మళ్లీ యాజమాన్యాలకు కట్టకుంటే.. మరల పింఛన్ ఇవ్వమని, మలివిడత విద్యా దీవెన మంజూరు కాదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాలా దీసేలా ఉందని.. ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందన్నారు. దిగువ స్థాయిలో పెరిగిన అవినీతిని నిర్మూలించాలని.. లేకపోతే ఎన్ని పథకాలు పెట్టినా ప్రయోజనం లేదన్నారు. అవినీతి నిర్మూలనతో నవీన్ పట్నాయక్ మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ డీఎల్.రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు.
DL Ravindra reddy comments: రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, ప్రజాస్వామ్యం ఓడిపోయింది: డీఎల్ రవీంద్రారెడ్డి - ap latest news
DL Ravindra reddy comments: రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని.. వైకాపా నాయకుడు, మాజీ మంత్రి డీ.ఎల్.రవీంద్రారెడ్డి అన్నారు. సీఎం జగన్ రెండున్నరేళ్లపాలనపై.. ఎప్పటిలానే విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా వచ్చిన డబ్బులు మళ్లీ యాజమాన్యాలకు కట్టకుంటే.. మరల పింఛన్ ఇవ్వమని, మలివిడత విద్యా దీవెన మంజూరు కాదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, ప్రజాస్వామ్యం ఓడిపోయింది: డీ.ఎల్.రవీంద్రారెడ్డి