ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేత భాస్కర్​రెడ్డి హత్య కేసు నిందితుల అరెస్ట్ - కడప నేర వార్తలు

కడప జిల్లాలో వైకాపా నాయకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జడ్పీటీసీ నామినేషన్ విషయంలో తలెత్తిన వివాదాలే హత్యకు కారణమని డీఎస్పీ విజయ్​కుమార్ తెలిపారు.

v
వైకాపా నేత భాస్కర్​రెడ్డి హత్య కేసు నిందితులను అరెస్ట్

By

Published : Feb 24, 2021, 4:49 PM IST

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం ముడుమాల వద్ద వైకాపా నాయకుడు భాస్కరరెడ్డి హత్య కేసుకు సంబంధించి నిందితులను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ బి. విజయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం స్థానిక సబ్‌ డివిజనల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్‌ విషయాన్ని వెల్లడించారు. జడ్పీటీసీ నామినేషన్‌ విషయంలో ముడుమాల గ్రామానికి చెందిన భాస్కరరెడ్డి, పలుగురాళ్లపల్లె గ్రామానికి చెందిన బసిరెడ్డి దుగ్గిరెడ్డి గొడవలు పడుతూ వచ్చారని, పగ పెంచుకున్న దుగ్గిరెడ్డి తన అనుచరులు బసిరెడ్డి రామిరెడ్డి, బసిరెడ్డి రమణారెడ్డిలతో కలిసి ఇనుపరాడ్లతో కలిసి దాడి చేసి భాస్కర్ రెడ్డిని హతమార్చినట్లు వివరించారు. కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని సీఐ కొండారెడ్డి, ఎసై శ్రీనివాసులు కలిసి సిద్ధయ్యగారిమఠం క్రాస్‌రోడ్డు వద్ద అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details