కడప జిల్లా బ్రహ్మంగారి మఠం గ్రామంలోని వైకాపాలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం వారికే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. తమ వర్గం వారికి అన్యాయం చేస్తున్నారంటూ సచివాలయంలో ఓ వర్గ నాయకుడు మండిపడ్డాడు. ఆదివారం సెలవురోజైనా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు సిబ్బంది సచివాలయం చేరుకోగా.. ఆ నాయకుడు వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనతో సచివాలయ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదే క్రమంలో ఆ నాయకుడు గ్రామానికి చెందిన ఒక వాలంటీర్‌పై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సచివాలయ సిద్ధమైనట్లు సమాచారం.
గ్రామ సచివాలయ సిబ్బందిపై వైకాపా నాయకుడు దాడి - ycp leader attacks village secretariat staff
గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వైకాపా నాయకుడు ఒకరు సచివాలయ సిబ్బందిపై మండిపడ్డారు. వాలంటీర్‌పై కూడా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
గ్రామ సచివాలయ సిబ్బందిపై వైకాపా నేత దాడి