జీవనోపాధి కోసం విదేశాలకు, వేరే రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలకు అండగా ప్రభుత్వం ఉందని... వైకాపా నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో... సీఎం జగన్ మాట్లాడి 3 కోట్ల రూపాయలు కేటాయించి వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చారని తెలిపారు.
'వలస కూలీలకు అండగా వైకాపా ప్రభుత్వం' - కడపలో వలస కూలీల వార్తలు
వివిధ రాష్ట్రాలు, దేశాల్లో చిక్కుకున్న వలస కూలీలకు అండగా వైకాపా ప్రభుత్వం ఉందని... ఆ పార్టీ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని వివరించారు.
ycp leader Akepati Amarnath Reddy respond on government support to the migrant workers
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలుగువారిని స్వగ్రామాలకు చేర్చడానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని... ప్రతీ ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటోందని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:మాంసం కోసం జనం బారులు