ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏడాదిలో ప్రకటనలకు రూ.101 కోట్లు సమంజసమా?' - pcc leader tulasi reddy fires on ycp news

వైకాపా ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని సర్కార్... ప్రకటనలకు మాత్రం కోట్లు కుమ్మరిస్తోందని దుయ్యబట్టారు.

tulasi reddy
tulasi reddy

By

Published : Aug 28, 2020, 4:47 PM IST

మింగడానికి మెతుకు లేదు... మీసాలకు సంపంగి నూనె అన్న చందంగా వైకాపా ప్రభుత్వ వైఖరి ఉందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు సకాలంలో చెల్లించట్లేదని దుయ్యబట్టారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాల్సి ఉండగా... జులై నెలలో 10న, ఆగస్టులో 5వ తేదీన జీతాలు ఇచ్చారన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చి... ఇంకా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.

ఏడాది కాలంలో ప్రభుత్వ ప్రకటనలకు 101 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సమంజసమా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. 52 కోట్ల రూపాయల ప్రకటనలు కేవలం సొంత పత్రికకు ఇవ్వడం ధర్మమా అని ఓ ప్రకటనలో నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details