ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైద్య కళాశాల ఏర్పాటుకు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులను శనివారం జారీ చేసింది. కళాశాలలో మౌలిక వసతులు, ఫర్నీచర్, వైద్య పరికరాల కొనుగోలుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. వీటితో పాటు కళాశాల ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణకు మరో 104 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.
ఈ కళాశాలకు వంద ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. పులివెందులలో ఏ ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న దానిపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసి... స్థలాన్నీ పరిశీలించింది.