ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హత్యా రాజకీయాలను ప్రోత్సహించటం దుర్మార్గం' - kadapa district latest news

తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య వైకాపా నేతల పిరికిపంద చర్య అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించడం అధికార పార్టీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు.

kasibhatla sainath sharma
kasibhatla sainath sharma

By

Published : Dec 30, 2020, 7:33 AM IST

వైకాపా ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం హత్యకు గురైన నందం సుబ్బయ్య భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... వైకాపా సర్కార్​పై మండిపడ్డారు.

నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే నందం సుబ్బయ్య హత్య వైకాపా నేతల పిరికిపంద చర్య. హత్యా రాజకీయాలు ప్రోత్సహించడం అధికార పార్టీకి అలవాటుగా మారింది. తమది అవినీతిరహిత ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్​కు వైకాపా నాయకులు చేస్తున్న అవినీతి కనిపించటం లేదా?. నందం సుబ్బయ్య హత్యపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు-కాశీభట్ల సాయినాథ్, తెదేపా రాష్ట్ర కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details