కడప జిల్లా వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వీరపనాయునిపల్లి మండలం పాయసంపల్లెలో వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మహేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి వర్గాలకు చెందిన కార్యకర్తలు కర్రలు, కత్తులతో పరస్పర దాడులకు తెగబడ్డారు.
కడప వైకాపాలో వర్గ పోరు...గాల్లోకి ఓ వర్గం నేత కాల్పులు - వైకాపా నేతల మధ్య గొడవ తాజా వార్తలు
14:56 January 01
వైకాపాలో వర్గ విభేదాలు
నూతన ఏడాది వేడుకల దృష్ట్యా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులే వివాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. గతరాత్రి ఇరువర్గాలు వాదించుకోగా...ఇవాళ మధ్యాహ్నం మహేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి వర్గాలు దాడి చేసుకున్నాయి. నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఇంటిపై వేటకొడవళ్లు, రాళ్లతో దాడి చేయగా...ఆత్మరక్షణ కోసం సుధాకర్ రెడ్డి తన వద్దనున్న లైసెన్స్ తుపాకీతో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘర్షణలో ముగ్గురికి గాయాలు కాగా..ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తోందని పోలీసులు తెలిపారు. యర్రగుంట్ల సీఐ ఉలసయ్య గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండువర్గాలపై కేసులు నమోదు చేశామని సీఐ వెల్లడించారు.
ఇదీచదవండి