ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆక్రమణలు తొలగించాలంటూ వైకాపా నాయకుల ధర్నా - కడపలో చెరువులు

కడప జిల్లా దుంపలగట్టు చెరువు పరిధిలో అక్రమ కట్టడాలు, ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు వైకాపా నాయకులు. ఖాజీపేట తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

ycp dharna to remove illegal constructions, encroachments in the pond
చెరువులో అక్రమ కట్టడాలు,ఆక్రమణలు తొలగించాలని వైకాపా ధర్నా

By

Published : Oct 28, 2020, 4:45 PM IST

కడప జిల్లా దుంపలగట్టు చెరువు పరిధిలో అక్రమ కట్టడాలు, ఆక్రమణలను తొలగించాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఖాజీపేట తహసీల్దారు కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

చెరువులన్నింటిని సర్వే చేసి సరిహద్దులు గుర్తించాలని సూచించారు. ఆక్రమణలు జరిగిన ప్రదేశాల్ని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దుంపలగట్టు చెరువు పరిధిలో చేసిన అక్రమ కట్టడాలను తొలగించాలన్నారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details