ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా కౌన్సిలర్ రాజీనామా.. ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి - jammalamadugu latest news

జమ్మలమడుగు మున్సిపాలిటీ నాలుగో వార్డు నుంచి గెలిచిన వైకాపా అభ్యర్థి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు. తనకు ఛైర్మన్ పదవి ఇస్తానని ఎమ్మెల్యే మోసం చేశారని, డబ్బులు ఇస్తే... ఎమ్మెల్యే ఎవరికైనా పదవి ఇస్తారని ఆరోపించారు.

ycp councilor  resign at jammalamadugu
వైకాపా కౌన్సిలర్ రాజీనామా

By

Published : Mar 18, 2021, 12:15 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ నాలుగో వార్డు నుంచి వైకాపా తరఫున కౌన్సిలర్​గా గెలిచిన జ్ఞాన ప్రసూన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట ఇచ్చి... ఇప్పుడు మోసం చేశారని ఆమె ఆరోపించారు.

తనకు కాకుండా 12వ వార్డు కౌన్సిలర్​గా గెలిచిన శివమ్మకు ఛైర్మన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తే... ఎమ్మెల్యే ఎవరికైనా పదవి ఇస్తారని ఆరోపించారు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇంకా చాలామంది వైకాపా కౌన్సిలర్లు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details