కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వలసపల్లె గ్రామంలో వైకాపా నాయకులు తనపై దాడి చేెశారని.. అదే గ్రామానికి చెందిన తెదేపా మద్దతుదారు పద్మావతి ఆరోపించారు. జడ్పీటీసీ సభ్యుడు బాలయ్య, అతడి అనుచరులు.. తమ కుటుంబంపై దాడి చేసినట్లు ఆరోపించారు.
గత సాధారణ ఎన్నికల్లో సమయంలోనూ తనను కిడ్నాప్ చేశారని.. పోలీసులే రక్షించారని పద్మావతి తెలిపారు. విచక్షణారహితంగా దుర్భాషలాడి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారి వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. గాయపడిన పద్మావతిని ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.