ఎన్నికల ప్రచారంలో.. వైకాపా ఆటో ర్యాలీ - కడప జిల్లా రాజంపేట
ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా రాజంపేటలో ఆటో కార్మికులతో కలిసి వైకాపా నాయకులు భారీ ర్యాలీ చేశారు.
వైకాపాకు మద్దతుగా ఆటో కార్మికుల ర్యాలీ
By
Published : Mar 27, 2019, 3:03 PM IST
వైకాపాకు మద్దతుగా ఆటో కార్మికుల ర్యాలీ
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా కార్మికులు ఆటో ర్యాలీ చేశారు. స్థానిక మన్నూరు ఎల్లమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్, శివాలయం, పాతబస్టాండ్ మీదుగా రైల్వేస్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మేడా మల్లికార్జున్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.