ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవినీతిని ప్రశ్నించినందుకే గురునాథ్ రెడ్డి హత్య: బీటెక్ రవి - తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి వార్తలు

అవినీతిని ప్రశ్నించినందుకే కడప జిల్లా పి.అనంతపురంలో వైకాపా కార్యకర్త గురునాథ్ రెడ్డిని హత్య చేశారని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. ఈ హత్య కేసులో స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులను దోషులుగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

tdp mlc b tech ravi
tdp mlc b tech ravi

By

Published : Nov 16, 2020, 4:38 PM IST

గండికోట నిర్వాసితుల పరిహారంలో అవినీతిని ప్రశ్నించినందుకే కడప జిల్లా పి.అనంతపురంలో వైకాపా కార్యకర్త గురునాథ్ రెడ్డి హత్యకు గురయ్యారని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. 354 ఓటర్లు ఉన్న పి.అనంతపురం గ్రామంలో 750మందికి పైగా లబ్ధిదారులను ఎలా చేర్చారని నిలదీశారు. దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారుల హస్తం ఉందని అన్నారు.

గురునాథ రెడ్డి హత్య కేసులో స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులను దోషులుగా చేర్చాలని బీటెక్‌ రవి డిమాండ్‌ చేశారు. హత్యకు గల కారణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే అనర్హులకు లబ్ధి చేకూర్చే కుట్ర కూడా బయట పడుతుందన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను న్యాయమూర్తికి అందచేస్తామని బీటెక్‌ రవి వెల్లడించారు.

ఇదీ చదవండి
వైకాపా కార్యకర్త గురునాథ్ రెడ్డి హత్య

ABOUT THE AUTHOR

...view details