ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధ్వానంగా నగర రహదారులు.. ఇక్కట్లు పడుతున్న ప్రజలు - Kadapa district updates

రాష్ట్రంలో ఉన్న రహదారుల మరమ్మతులకు అక్టోబరులో టెండర్లు పిలిచి.. వచ్చే అక్టోబరు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కానీ ముఖ్యమంత్కి సొంత జిల్లా కేంద్రం కడపలోనే రహదారుల పరిస్థితి చాలా అద్వానంగా ఉంది. ఇప్పటికే గుంతలమయమైన రహదారులు... చిన్నపాటి వర్షానికి మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలుస్తుంటే..వచ్చే ఏడాదికి పరిస్థితి ఏ విధంగా ఉంటుందోననే ఆందోళన నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. కార్పొరేషన్ వసూలు చేసే పన్నులన్నీ దేనికి ఖర్చు పెడుతున్నారని ప్రజలు నిలదీస్తున్నారు.

Worst roads in Kadapa district
Worst roads in Kadapa district

By

Published : Sep 12, 2021, 8:28 PM IST

అధ్వానంగా నగర రహదారులు... తీవ్ర ఇక్కట్లు పడుతున్న ప్రజలు

అసలే ఇరుకైన దారులుండే కడపలో..వర్షాకాలానికి దెబ్బతిన్న రహదారులపై ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చిన్నపాటి వాన కురిసినా.. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఆర్​టీసీ బస్టాండు కూడలి, కోర్టు రోడ్డు, వై జంక్షన్, అప్సర కూడలి, ఐటీఐ కూడలి ప్రాంతాల్లో.. రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇది కడప నగరమా లేక మారమూల గ్రామమా అని ప్రజలు అనుకోవాల్సి వస్తోంది. నగరంలో 8 రహదారులకు నిధులు మంజూరైనా.. పనులు చేపట్టేందుకు నెలల తరబడి జాప్యం చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా రోజూ ఇదే రహదారులపై తిరుగుతున్నా.. పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. సీఎం జగన్ తన సొంత జిల్లాపై మరింత దృష్టి సారించి.. త్వరితగతిన రోడ్లను బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details