కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో అక్టోబరు 4 నుంచి 6 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నారాయణ స్పష్టం చేశారు. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4వ తేదీన ప్రజల్లో వారోత్సవాలపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. 5, 6 తేదీల్లో అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇప్పటివరకు ప్రయోగించిన రాకెట్ల నమూనాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
వచ్చే నెల 4 నుంచి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు - starting next month
అక్టోబరు 4 నుంచి 6 వరకు కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య కళాశాలలో అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు