కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలోని లక్ష్మీగారిపల్లె, శెట్టిగుంట గ్రామస్థులు... దశాబ్దాలుగా రాజు-రాణి కొయ్య బొమ్మల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర కళాత్మక కొయ్యబొమ్మల ఉత్పత్తిదారుల సహకార సంస్థ పేరిట ఓ సంఘంగా ఏర్పడి ఇక్కడి బొమ్మలను ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. మన రాష్ట్రంలో దేవాలయాల వద్ద వీటిని అధికంగా విక్రయిస్తారు. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వివాహ సమయంలో వధూవరులు ఒకరికొకరు వీటిని ఇచ్చిపుచ్చుకునే ఆచారం ఉండటంతో అక్కడా డిమాండ్ ఎక్కువే.
కరోనా వల్ల కష్టాల్లో కొయ్యబొమ్మల కళాకారులు... ప్రభుత్వమే మార్గం చూపాలని విజ్ఞప్తి - కడప జిల్లా తాజావార్తలు
కొనుగోళ్లు లేక కొయ్యబొమ్మ కళాకారులు కూలీలుగా మారుతున్నారు. ఏడాదిన్నరగా గిరాకీలు లేక గగ్గోలు పెడుతున్నారు. రెండు దశల్లో కరోనా కాటేయడం వల్ల జీవనాధారం కోల్పోయి వారంతా అవస్థలు పడుతున్నారు.
![కరోనా వల్ల కష్టాల్లో కొయ్యబొమ్మల కళాకారులు... ప్రభుత్వమే మార్గం చూపాలని విజ్ఞప్తి కొయ్యబొమ్మలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12279727-957-12279727-1624791005990.jpg)
గతేడాది మార్చి నుంచి కొయ్యబొమ్మల కళాకారులకు కరోనా కష్టాలు మొదలయ్యాయి. ఆలయాలకు భక్తుల రాక, ఇతర రాష్ట్రాలకు రవాణా సౌకర్యం తగ్గటంతో తయారు చేసిన బొమ్మలు ఇళ్లల్లోనే ఉంచుకుంటున్నారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ లేపాక్షి... కొయ్యబొమ్మ కళాకారుల కోసం లక్ష్మీగారిపల్లెలో 30 సెంట్ల భూమి కొని 50లక్షలతో ఓ భవనాన్ని నిర్మించింది. బొమ్మల తయారీకి అనువైన యంత్రాలు అమరుస్తున్నారు. ఈ భవనాన్ని త్వరగా ప్రారంభిస్తే ఉపాధి దొరుకుతుందని కళాకారులు ఆశిస్తున్నారు.తమ వద్ద నిల్వ ఉండిపోయిన బొమ్మల వ్యాపారానికి ప్రభుత్వమే దారి చూపాలని కళాకారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:సాఫ్ట్వేర్ కొలువును వదిలి.. చిత్రకళలో సత్తా చాటుతోన్న యువతి