కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆఫీస్‌ను 18వ వార్డు మహిళా ఓటర్లు ముట్టడించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని 18, 19 వార్డులో వైకాపా ఏకగ్రీవం చేసుకుందని మండిపడ్డారు. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అధికార పార్టీ.. అలా ఎలా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యేను నిలదీసేందుకు కార్యాలయానికి వచ్చామన్నారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించిన మహిళా ఓటర్లు - jammalamadugu latest news
కడప జిల్లా జమ్మలమడుగులోని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యాలయాన్ని 18వ వార్డు మహిళా ఓటర్లు ముట్టడించారు. ఎవరిని అడిగి ఏకగ్రీవం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేలా తమకు న్యాయం చేయాలని కోరారు.
రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును కాలరాస్తారా అంటూ ప్రశ్నించారు. కార్యాలయానికి వచ్చిన మహిళలకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే వెళ్లిపోవటంతో.. ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనంలో వెళ్లిపోతూ.. ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి మాట్లాడారు. పట్టణంలోని 20 వార్డుల్లో..18 వార్డులకు నామినేషన్ వేసి, 18,19 వార్డులకు ఎందుకు నామినేషన్ వేయలేదో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పాలన్నారు. దమ్ముంటే పోటీ చేయమని అడగండంటూ వెళ్లిపోయారు.
ఇదీ చదవండి:విజయవాడలో తెదేపాకు నాలుగైదు సీట్లు వచ్చే పరిస్థితి లేదు: మంత్రి పెద్దిరెడ్డి