ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురపాలక ఎన్నికల్లో.. మహిళలదే పైచేయి!

పురపాలక పోరులో మహిళలు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి పురపాలక సంఘంలోని మహిళా ఓటర్లు తమ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.

women voters plays a key role in municipal elections at kadapa district
పురపాలక ఎన్నికల్లో మహిళలదే పైచేయి

By

Published : Feb 17, 2021, 3:20 PM IST

పుర పోరులో మహిళలు కీలకంగా మారారు. కడప జిల్లాలో.. కడప నగరపాలకసంస్థ, మరో 7 పుర సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో ఆరు చోట్ల మొత్తం ఓటర్లలో మహిళలు అధికంగా ఉన్నారు. రాయచోటి, పులివెందుల పురపాలక సంఘాల్లో మాత్రమే పురుషుల కంటే కొంత తక్కువ సంఖ్యలో మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రతి పురపాలక సంఘంలోని మహిళా ఓటర్లు తమ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా వారి ఓట్లు ఎక్కువగా ఉండడంతో పోలింగ్‌లోనూ వారే అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.

  • ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో మహిళా ఓట్లు కీలకంగా మారాయి. ఇక్కడ పురుషుల కంటే 3,315 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. పట్ణణంలో మొత్తం 41 వార్డులు ఉండగా 36 చోట్ల వారే ఎక్కువ. 1, 2, 6, 8, 9, 10, 11, 16, 17, 21, 29, 33, 37, 41 వార్డుల్లో పురుషుల కన్నా వందకుపైగా నారీమణులు ఎక్కువగా ఉన్నారు. అయిదు వార్డుల్లోనే పురుషులు తమ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. 12, 19, 22, 23, 24 వార్డుల్లో ఈ పరిస్థితి నెలకొంది.
  • జమ్మలమడుగు నగరపంచాయతీలో పురుషుల కంటే 1,405 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక్కడ మొత్తం 20 వార్డుల్లో వాళ్లే ఎక్కువ. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో పురుషుల కంటే 620 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక్కడ మొత్తం 20 వార్డులు ఉండగా 16 చోట్ల వాళ్లే ఎక్కువ. కేవలం నాలుగు వార్డుల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు తక్కువగా ఉన్నారు. 5, 6, 16, 17 వార్డుల్లో ఈ పరిస్థితి ఉంది. మైదుకూరు పురపాలక సంఘంలో పురుషుల కంటే 789 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక్కడ మొత్తం 24 వార్డులుండగా 18 వార్డుల్లో మహిళలే ఎక్కువ. ఆరు వార్డుల్లో మాత్రమే పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు తక్కువగా ఉన్నారు. బద్వేలు పురపాలక సంఘంలో పురుషుల కంటే 384 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక్కడ మొత్తం 35 వార్డులు ఉండగా మహిళలు 23, పురుషులు 12 చోట్ల ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రాయచోటి పురపాలక సంఘంలో మహిళల కంటే 32 మంది పురుష ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 34 వార్డులు ఉండగా మహిళలు 18, పురుషులు 18 చోట్ల ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పులివెందుల పురపాలక సంఘంలో మహిళల కంటే 10 మంది పురుష ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 33 వార్డులు ఉండగా సగానికిపైగా చోట్ల మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details