కడప జిల్లా వేంపల్లె మండలం ఎగువ తువ్వపల్లిలోని మామిడి తోటలో మోపూరి వెంకటసుబ్బమ్మ (38) అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు పెండ్లిమర్రి మండలం అగ్రహారం వాసిగా గుర్తించారు. అయితే మహిళది హత్య? ఆత్మహత్య ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మామిడితోటలో మహిళ అనుమానాస్పద మృతి - కడపలో వివాహిత మృతి తాజా వార్తలు
వేంపల్లిలోని మామిడితోటలో మహిళ ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కడప జిల్లా వేంపల్లిలో మహిళ నుమానస్పద మృతి