కడప జిల్లా ఎర్రగుంట్లలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణానికి చెందిన రాధకు, నాగేశ్వర్‌తో వివాహం జరిగింది. నాగేశ్వర్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా వీరిరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో పంచాయితీ జరిగింది.
ఈ ఘటనపై మనస్తాపం చెందిన రాధ.. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే.. తమ కూతురును భర్త తరఫు బంధువులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.