కడప జిల్లా సింహాద్రిపురం మండలం లావనూరు గ్రామానికి చెందిన నాగ సులోచన... మనస్తాపానికి గురై పైడిపాలెం ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన జీవాల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాజెక్టు వద్ద పోలీసులు చేరుకుని నాగ సులోచన కోసం గాలింపు చేపట్టారు. ప్రాజెక్టులో నీరు ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు అడ్డంకిగా మారింది. సాయంత్రం వరకు వెదికినప్పటికీ జాడ లభించకపోవడంతో గాలింపు చర్యలను నిలిపివేసినట్లు సింహాద్రిపురం ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆత్మహత్యకు పాల్పడిన నాగ సులోచనకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
SUICIDE ATTEMPT : మహిళ ఆత్మహత్యాయత్నం... కుటుంబ సమస్యలే కారణం - kadapa district crime
కడప జిల్లా లావనూరులో విషాదం(tragedy) నెలకొంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత మనస్తాపంతో పైడిపాలెం ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యాయత్నానికి(suicide attempt) పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు(searching operation) చేపట్టారు.
మహిళ ఆత్మహత్యాయత్నం