ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేతి వృత్తుల్లో శిక్షణ...మహిళల ఉపాధి రక్షణ

ఆలోచన ఉంటే ఉపాధి మార్గాలు అనేకం. స్వయం ఉపాధి రంగాల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే... నలుగిరికి ఉపాధి కల్పించే స్థితికి ఎదగొచ్చని నిరూపిస్తున్నారు ఈ మహిళలు. చేతి వృత్తులు చేపడుతూ..అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు.  నాబార్డ్ ఆర్థికసహకారంతో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, పెయింటింగ్ తదితర వృత్తుల్లో శిక్షణ పొంది.. ఉపాధి రంగాల్లో రాణిస్తున్నారు.

చేతి వృత్తుల్లో శిక్షణ...మహిళల ఉపాధి రక్షణ

By

Published : Sep 7, 2019, 6:18 AM IST

చేతి వృత్తుల్లో శిక్షణ...మహిళల ఉపాధి రక్షణ
నాబార్డ్ సంస్థ ఆర్థిక సాయంతో దాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కడప శివారులోని పి.ఎస్.నగర్, ఆటోనగర్ ప్రాంతాలకు చెందిన మహిళలకు చేతి వృత్తులపై శిక్షణ పొందుతున్నారు. గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని నిర్వాహకులు అంటున్నారు. భార్య, భర్తలిద్దరి సంపాద ఉంటేనే...సంసారం సాఫీగా సాగిపోతుందని వివరిస్తూ... చేతి వృత్తుల్లో నిపుణులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ శిక్షణకు నాబార్డ్ సంస్థ ఆర్థిక సహాయం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, పెయింటింగ్ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 60 మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. నిపుణులు వీరికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన వారికి ప్రభుత్వ తరఫున ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. శిక్షణ అనంతరం ప్రభుత్వ రుణాలు మంజూరు చేసి.. కావలసిన సామాగ్రిని కొనుగోలు చేయించి తోడ్పాటు అందిస్తున్నారు.

ఇదీ చదవండి :

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details