ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నమ్మకమూ.. పట్టుదల.. తన రెండు రెక్కలుగా... - special story on women auto driver

చిన్న వయసులోనే తల్లిదండ్రులను పొగొట్టుకుని అనాథ అయ్యింది.. పదహారేళ్లు నిండకుండానే పెళ్లైంది.. ఏడాది నిండకుండానే భర్త చనిపోయి మళ్లి దిక్కులేనిదయ్యింది. బతుకు బండిని ఎలా నడిపించాలో దిక్కుతోచని స్థితిలో... ఆటో స్టీరింగ్​ పట్టింది. బతకాలన్న ఆకాంక్ష ముందు అన్నీ చిన్న బోతాయని నిరూపిస్తోన్న ఆటోవాలీ శంకరమ్మపై ప్రత్యేక కథనం..

women running auto at  kadapa railwakoduru
women running auto at kadapa railwakoduru

By

Published : Mar 19, 2021, 3:39 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన శంకరమ్మకు ఊహతెలియని వయసులో అమ్మానాన్న చనిపోయారు. బంధువుల ఇంట్లోనే పెరిగింది. కొంత వయసు వచ్చేసరికి ఎస్సార్​ కాలనీకి చెందిన బంధువు.. చిన్న ఆమెను చేరదీశాడు. అక్కడ కూలిపని చేసుకుంటూ బతికేది. శంకరమ్మ చిన్నవయసులోనే పెళ్లి చేశాడు చిన్నా.. భర్త తాగుడుకు బానిసై ఒక్క సంవత్సరంలోనే అకాల మరణం చెందాడు. శంకరమ్మ మళ్లీ అనాథ అయ్యింది.

ఎలా బతకాలో తెలియని పరిస్థితి... మరలా ఆమెను చిన్నా చేరదీసి ఒక అద్దె ఇంట్లో నివాసం కల్పించాడు. ఎంత కష్టమైనా సరే.. తన కాళ్ల మీద నిలబడాలనుకుంది శంకరమ్మ. తనను చేరదీసి చిన్నాను ఆటో నడపటం నేర్పించమని.. డ్రైవింగ్ నేర్చుకుంది. చిన్న అతని దగ్గరున్న పాత ఆటోను శంకరమ్మకు ఇచ్చాడు. స్త్రీలు పురుషులతో సమానంగా పనిచేస్తారని నిరూపిస్తూ.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది శంకరమ్మ.

'ప్రస్తుతం పెట్లోల్​ ధరలు పెరిగి ఆటో నడపటం కష్టమవుతోంది. ఆటో సరిగా లేదు. ప్రభుత్వం దయతలచి ఇల్లు, కొత్త ఆటో ఇప్పిస్తే నేను ఆనందంగా జీవిస్తా. కనీసం రేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు అందడం లేదు. అధికారులు రేషన్ కార్డు కల్పించాలని వేడుకుంటున్నా. '-శంకరమ్మ, ఆటో డ్రైవర్

ఇదీ చదవండి: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

ABOUT THE AUTHOR

...view details