ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

20 రోజులుగా నీటికి కటకట.. ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన - AP Latest News

Drinking water problems: వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసుల గొంతు ఎండుతోన్నా.. ఇరవై రోజులుగా తాగునీటి ఎద్దటి ఉన్నప్పటికీ తమను పట్టించుకునే నాదుడే లేడా అంటూ ఖాళీ బిందెలతో గ్రామ కాలనీ వాసులు నిరసన తెలిపారు. తమకు మంచి నీటిని ఇవ్వాలి తమ గోడును తీర్చాలి అంటూ నినాదాలు చేశారు.

1
1

By

Published : Mar 1, 2023, 4:45 PM IST

వైఎస్ఆర్ జిల్లాలో ఇరవై రోజులుగా తాగునీటి ఎద్దటి.. ఖాళీ బిందెలతో మహిళలు నిరసన

Drinking water problems: వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలంలోని యర్రగుడిపాడు గ్రామంలో గత ఇరవై రోజులుగా తాగునీరు లేక గొంతెండుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది అధికారులు, రాజకీయ నాయకుల దగ్గరకు సమస్యను తీసుకెళ్లినా తమ గోడు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తమకు మంచినీటి సమస్యను తీర్చాలని వాపోయారు.. అంతేకాక తమ కాలనీకి వచ్చే రోడ్డు కూడా సరిగా లేదంటూ తాము, తమ పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని కాలనీవాసులు చెబుతున్నారు. గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీలకు తాగునీరు రావడం లేదని పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని వారు వాపోతున్నారు.

ఇక చేసేదేమీ లేక కాలనీ వాసులందరూ కలిసి సొంత ఖర్చులతో ట్యాంకర్లను కొనుక్కొని గొంతు తడుపుకుంటున్నామని.. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి తమ గోడు విని మాకు ఉన్న నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. త్రాగునీటి సమస్య ఇప్పుడే కాకుండా గతంలో కూడా తమ కాలనీకి కలుషిత నీరు వచ్చాయని అప్పుడూ అధికారుల, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. నామమాత్రంగా వాటిని రిపేరు చేసి చేతులు దులుపుకున్నారే తప్ప.. శాశ్వత పరిష్కారం చూపించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు వచ్చినా సరే తమను కేవలం ఓట్లకు మాత్రమే వాడుకుంటున్నారని.. ఓట్ల అనంతరం తమ కాలనీకి ఎటువంటి అభివృద్ధి చేయాలని కానీ.. తమను అభివృద్ధి చేయాలని కానీ ఎవరు ఆలోచించలేదని వారు వాపోతున్నారు.

చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో మంచినీరు లేకపోతే తాము ఎలా జీవించాలంటూ మహిళలందరూ కలిసి ఖాళీ బిందెలు తీసుకొని నిరసన తెలుపుతున్నారు. దాదాపు 20 రోజుల నుండి మంచినీళ్లు రాకపోతే ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు. ఇళ్లలో ద్విచక్ర వాహనాల ఉన్నవారు తమ సొంత వాహనాలలో ఇతర గ్రామాలకు వెళ్లి త్రాగునీటిని తెచ్చుకుంటారని.. అవి ఏవీ లేనివారు మంచినీటిని ఎలా తెచ్చుకోవాలంటూ ఆరోపిస్తున్నారు. తినడానికి అన్నం లేకపోయినా ఉండొచ్చు కానీ.. తాగడానికి మంచినీరు లేకపోతే ఎలా ఉంటామని నిలదీస్తున్నారు. ఉదయం లేస్తూనే చిన్న పిల్లలను స్కూలుకు పంపించడానికి కూడా వారి స్నానానికి తాగునీటికి అనేక రకాల అవస్థలు పడుతున్నామని వారు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, గ్రామ సర్పంచ్ స్పందించి తమ కాలనీ వాసులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details