ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్​ బియ్యంలో పురుగులు.. మహిళల నిరసన - nakkalapalli latest news

పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం రేషన్​ బియ్యాన్ని అందిస్తోంది. ఈ కరోనా కాలంలో అసలే ఆదాయం లేకుండా ఉన్న ఎన్నో కుటుంబాలు రేషన్​పైనే ఆధారపడుతున్నారు. అలాంటిది నాణ్యతలేని సరుకులు అందించటం దురదృష్టకరం. కడప జిల్లా చిట్వేలు మండలం నక్కలపల్లిలో పురుగులు పట్టిన బియ్యం పంపిణీ చేస్తున్నారంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

ration rice
పురుగుల బియ్యాన్ని చూపుతున్న వృద్ధురాలు

By

Published : Jun 19, 2021, 10:05 PM IST

పురుగులు పట్టిన రేషన్​ బియ్యంపై మహిళల ఆందోళన

కడప జిల్లా చిట్వేలు మండలం నక్కలపల్లిలో ప్రభుత్వం ఇచ్చే రేషన్​ బియ్యంలో పురుగులు ఉన్నాయని స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నాణ్యత లేని సరుకు వద్దంటూ ఆందోళన చేశారు. బియ్యం పంపిణీ చేస్తున్న వాహనాన్ని వారు అడ్డుకున్నారు. రేషన్​ ద్వారా సన్నరకం బియ్యం అందిస్తామన్న ప్రభుత్వం పురుగుల బియ్యం ఇచ్చిందని.. వాటితో పొట్ట పోసుకునేదెలా అంటూ వాపోయారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికీ రేషన్​ పంపిణీ చేపట్టింది. కానీ ఇలాంటి పురుగులు పట్టిన బియ్యం అందించటం ఎంతవరకు న్యాయమంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న వేళ... ఇలాంటి నాణ్యత లేని బియ్యంతో చేసిన ఆహారం తిని ఇంకా వ్యాధుల బారిన పడాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి.. నాణ్యమైన బియ్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:'ప్రతీ ఇంటికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం.. త్వరలో!'

ABOUT THE AUTHOR

...view details