ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందులలో మహిళ దారుణ హత్య - పులివెందుల నేర వార్తలు

కడప జిల్లా పులివెందులలో దారుణం జరిగింది. పట్టణానికి చెందిన ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

women murdered in pulivendula kadapa district
పులివెందులలో మహిళ దారుణ హత్య

By

Published : Aug 9, 2020, 6:23 PM IST

కడప జిల్లాలోని పులివెందుల ఎస్బీఐ కాలనీలో శివరాణి అనే మహిళ నివసిస్తోంది. ఈమెకు 14 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా ఉడుమలకుర్తి గ్రామానికి చెందిన గోపాల్​తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తటంతో శివరాణి... భర్త నుంచి దూరంగా ఉంటూ పులివెందులలో నివసిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ వాసుదేవన్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details