కడప జిల్లా రాజంపేటలో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పట్టణంలోని ముకుందరగడ్డకు చెందిన రామాంజులమ్మ తన భర్తతో కలిసి జీవనం సాగిస్తోంది. ఉదయం ఆమె భర్త పక్కింటి వాళ్లను పిలిచి తన భార్య ఉరి వేసుకుని కొన ఊపరితో కొట్టుమిట్టాడుతోందని చెప్పాడు. ఆసుపత్రికి తరలించేందుకు ఆటో తీసుకొస్తానని చెప్పి తిరిగిరాలేదు. ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్తే ఆమెను అంతమెుందించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మహిళ అనుమానాస్పద మృతి.. పరారీలో భర్త - kadapa
ఓ మహిళ ఉరేసుకొని మృతి చెందిన ఘటన కడప జిల్లాలో జరిగింది. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్తపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి