బీఎన్ తండాలో దారుణం.. నిద్రిస్తున్న మహిళపై.. - కడపలో యువతిపై దాడి
06:09 September 16
women legs and arms amputated in Kadapa district
కడప జిల్లా చక్రాయపేట మండలంలోని కె. యర్రగుడి గ్రామ పంచాయతీ పరిధిలోని బీఎన్ తాండాకు చెందిన ఇస్లావత్ ఈశ్వరమ్మ (50)అనే మహిళను భర్త నాగా నాయక్ మంగళవారం రాత్రి అతి కిరాతకంగా నరికాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఓ చేయి, రెండు కాళ్లు తెగిపోయి ఉన్నాయి.
నాగా నాయక్, ఈశ్వరమ్మ దంపుతులు బీఎన్ తండాలో నివాసముంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఈశ్వరమ్మపై అనుమానం పెంచుకున్న భర్త తరచూ ఆమెతో గొడవ పడేవాడు. నిద్రలో ఉండగానే.. దాడి చేసి పరారయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈశ్వరమ్మను కడప రిమ్స్‌కు తరలించారు. బంధువుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి:గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి-నదిలో గల్లంతైన ఇద్దరు యువకులు