ప్రేమోన్మాది చేతుల్లో మృతి చెందిన శిరీష కుటుంబానికి తగిన న్యాయం చేసే దిశగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఇటీవల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కడప జిల్లా బద్వేలుకు చెందిన శిరీష కేసును ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కేసు వివరాలను జగన్కు వివరించారు. దీంతో చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారని ఓ ప్రకటనలో ఆమె తెలిపారు.
శిరీష కుటుంబానికి తగిన న్యాయం: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ - మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
ముఖ్యమంత్రి వైయస్ జగన్తో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ భేటీ అయ్యారు. ప్రేమోన్మాది చేతుల్లో మృతి చెందిన శిరీష కుటుంబానికి తగిన న్యాయం చేయాలని సీఎంను ఆమె కోరారు.
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్