ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్ని కష్టాలెదురైనా.. సంకల్పం వీడలేదు! - కడపలో మహిళ ఆటో డ్రైవర్ వార్త

ఆమె బతుకుతెరువు కోసం ఇరవై ఏళ్ల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధృడ సంకల్పంతో ఎదుర్కొంది. భర్త మరణించాడు. ఒకగానొక్క కుమారుడు వివాహం చేసుకుని వెళ్లి పోయాడు. ఇంతలో కరోనా విజృంభణ. ఇన్ని కష్టాలు ఎదురైనా చెక్కుచెదరని విశ్వాసంతో అడుగు ముందుకేసింది. ఆటో డ్రైవర్​గా మారి జీవనాన్ని కొనసాగిస్తోంది. మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

women become as auto driver
ఆటో డ్రైవర్​గా మారిన మహిళ వార్తలు , కడపలో మహిళ ఆటో డ్రైవర్ వార్త

By

Published : Mar 30, 2021, 9:24 AM IST

కడపలోని పాత కడపకు చెందిన మేరీ దాదాపు 20 ఏళ్ల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లింది. అక్కడ నివాసాల్లో పని మనిషిగా ఉంటూ జీవనం కొనసాగించింది. మేరీ భర్త జాన్ మృతి చెందాడు. ఉన్న ఒక్క కొడుకు వివాహం చేసుకుని వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా 2020లో కరోనా విజృంభించడంతో విదేశాల్లో ఉన్న వారందరూ వారి వారి స్వస్థలాలకు వచ్చారు.

మేరీ కూడా ఆరు నెలల క్రితం కడపకు వచ్చింది. రానైతే వచ్చింది కానీ ఏం చేయాలో తెలియదు. కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆటో నేర్చుకుంది. మూడు లక్షలు రుణం తీసుకొని సొంత ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఇదీ చదవండి:కడప ఉక్కు భాగస్వామికి ఆర్థిక కష్టాలు

ABOUT THE AUTHOR

...view details