కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని మహిళలు ఎన్నికలు జరపాలని వైకాపా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ పంచాయతీ పరిధిలోని 9, 10 వార్డుల్లోని అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారు. తమకు ఏకగ్రీవం వద్దు.. ఎలక్షనే ముద్దంటూ వైకాపా కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మహిళలు గుమిగూడారు. ప్రజాస్వామ్యంలో ఓటును వినియోగించుకునే హక్కు తమకు లేదా అంటూ ఆవేదన చెందారు. ఎవరిని అడిగి ఏకగ్రీవాలు చేస్తున్నారని వారు ప్రశ్నించారు.
ఏకగ్రీవం వద్దు.. ఎన్నికలే ముద్దంటూ మహిళల ఆందోళన - ఈరోజు కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో మహిళలు ఆందోళన వార్తలు
ఏకగ్రీవం వద్దు.. ఎలక్షనే ముద్దంటూ ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని మహిళలు వైకాపా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎవరిని అడిగి ఏకగ్రీవాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![ఏకగ్రీవం వద్దు.. ఎన్నికలే ముద్దంటూ మహిళల ఆందోళన Women are worried to the muncipal elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10930569-90-10930569-1615270624108.jpg)
ఏకగ్రీవం వద్దంటూ మహిళలు ఆందోళన