కడప జిల్లా వల్లూరు మండలం సీతోర్పల్లె గ్రామానికి చెందిన శివతేజను... అదే గ్రామానికి చెందిన వంశీకృష్ణ రెడ్డి అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను పెళ్ళిచేసుకోవాలని పదే పదే ఫోన్ చేస్తుండటంతో మనస్తాపానికి గురైన శివతేజ 11వ తేదీన... పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు కడప రిమ్స్‌కు తరలించగా... చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందింది. యువతి ఆత్మహత్యకు కారకులైన వంశీకృష్ణ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, సుమంత్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య - kadapa district crime news
కడప జిల్లా సీతోర్పల్లె గ్రామంలో వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య