ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Woman Selfie Video Viral: 'మా కుటుంబానికి ప్రాణ హాని ఉంది.. కాపాడండి..' - కుటుంబానికి ప్రాణహాని ఉందని మహిళ సెల్ఫీ వీడియో

Woman Selfie Video Viral: తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొంటూ.. ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసింది. తమకు న్యాయం చేయాలని వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది.

Woman Selfie Video Viral
మా కుటుంబానికి ప్రాణ హాని ఉంది.. మహిళ సెల్ఫీ వీడియో వైరల్

By

Published : Dec 20, 2021, 11:56 AM IST

మహిళ సెల్ఫీ వీడియో వైరల్

Woman Selfie Video Viral: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహిళ నూర్జహాన్​ సెల్ఫీ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని... మమ్మల్ని ఆదుకోవాలని సెల్పీ వీడియోలో నూర్జహాన్​ కోరారు.

'నా భర్తకు.. వారి కుటుంబంతో ఆస్తి తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో యాక్సిడెంట్ చేయడంతో ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. రెండు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన నా కుమారుడిపై దాడి చేశారు. వాళ్లనుంచి మా ప్రాణాలకు ముప్పు ఉంది.. మాకు న్యాయం చేయండి' అని ఆ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు నూర్జహాన్​. ఈమేరకు బాధితురాలి నుంచి ఫిర్యాదుతో పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి..అన్నం తిని పడేసిన ప్లేట్లే పట్టించాయి..

ABOUT THE AUTHOR

...view details