ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కోటి రూపాయల స్థలం కబ్జా.. ముఖ్యమంత్రే ఆదుకోవాలి' - కడప జిల్లా తాజా వార్తలు

వైకాపా నాయకుల అండతో కోటి రూపాయలు విలువ చేసే స్థలాన్ని కొందరు కబ్జా చేశారని కడప జిల్లా నందలూరు మండలం ఇసుకపల్లిలో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేశారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డే కాపాడాలని బాధితురాలు వేడుకున్నారు.

woman requesting cm to save land occupation
ముఖ్యమంత్రే తమను ఆదుకోవాలని బాధితురాలి ఆవేదన

By

Published : Jan 7, 2021, 6:46 PM IST

కడప జిల్లా నందలూరు మండలం ఇసుకపల్లిలో ఏడు తరాలకు సంబంధించిన 32 సెంట్ల స్థలాన్ని స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కొందరు కబ్జా చేశారని బాధితురాలు రేణుక ఎల్లమ్మ ఆరోపించారు. ఆ భూమిలో ప్రహరీ నిర్మించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి సంబంధించి తమ వద్ద అసలైన పత్రాలు ఉన్నాయని.., నకిలీ పత్రాలు చూపించి ఆ స్థలాన్ని కబ్జా చేశారని అన్నారు. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుల సహకారంతో కబ్జాకు పాల్పడ్డారని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆమె తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డీయే తమను కాపాడాలని ఆమె వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details