కడప జిల్లా జమ్మలమడుగులో షేక్ హుస్సేన్(60), షేక్ బీబీ(55) దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 15 వ తేదీన మేకలను తీసుకుని వారు పొలానికి వెళ్లి అదృశ్యమయ్యారు. దీంతో ఈ నెల 16 వ తేదీన వారి కుమారుడు జమ్మలమడుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేకలతో సహా తల్లి దండ్రులు కనపడడం లేదని పోలీసులకు చెప్పాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మేకలు మైలవరం మండలం చిన్న కొమ్మెర్ల వద్ద ఉన్నట్లు గుర్తించారు. మరో బృందం చేపట్టిన గాలింపు చర్యల్లో దొమ్మర నంద్యాల పొలాల్లో షేక్ బీబీ మృతదేహాన్ని గుర్తించారు. సోమవారం జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతురాలి భర్త షేక్ హుస్సేన్ కన పడకపోవడంతో భార్యను హత్య చేసి పరారై ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
మైలవరం మండలంలో మహిళ దారుణహత్య
కడప జిల్లా మైలవరం మండలం దొమ్మర నంద్యాల పొలాల్లో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె హత్యకు గురైనట్లు నిర్దారించారు.
మహిళ దారుణహత్య