ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద నీటిలో కొట్టుకుపోయిన మహిళ - Woman missing in flood waters at kadapa district

కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ మహిళ వరద నీటిలో కొట్టుకుపోయింది. ఆమె కోసం గాలించగా గ్రామ సమీపంలోని చెరువులో శవమై తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వరద నీటిలో కొట్టుకుపోయిన మహిళ
వరద నీటిలో కొట్టుకుపోయిన మహిళ

By

Published : Oct 12, 2020, 7:28 AM IST

కడప జిల్లా లక్కిరెడ్డి మండలాకి చెందిన మచ్చరాజేశ్వరి(45) బ్యాంకులో నగదు జమ చేసేందుకు పక్కనే ఉన్న కొండవాండ్లపల్లికి వెళ్లింది. మార్గమధ్యలో వాగు ఉద్ధృతంగా ప్రవహించటంతో అందులో దిగగానే నీటిలో కొట్టుకుపోయింది. రాత్రి వరకు ఆమె ఇంటికి తిరిగిరాకపోవటంతో బంధువులు ఆమె కోసం గాలించగా గ్రామ సమీపంలో చెరువులో శవమై కనిపించింది. మృతదేహన్ని చూడగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details