కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు నెల్లూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తితో పరియయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో రాజశేఖర్ రెడ్డి ఆ మహిళ చేసుకుంటానని నమ్మించి, కొంతకాలం సహజీవనం చేశాడు.
బాధితురాలు పెళ్లి చేసుకోవాలని అడగ్గానే ముఖం చాటేశాడు. దీంతో చేసేదేమీ లేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు రాజశేఖర్ రెడ్డిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.